Breaking News

బెంగాల్‌లో ‘వక్ఫ్‌’ ఉద్రిక్తతలు

Published on Sat, 04/12/2025 - 06:25

కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్‌ చట్టానికి నిరసనగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కొందరు నిమ్టియా స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలుపై రాళ్లతో దాడికి దిగారు. రైల్వే స్టేషన్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. కనీసం పది మంది పోలీసులు సైతం ఈ దాడిలో గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు బీఎస్‌ఎఫ్‌ను రంగంలోకి దించారు. 

ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేశామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. రాళ్ల దాడిలో ప్రయాణికులు సైతం గాయపడ్డారని చెప్పారు. వక్ఫ్‌ చట్టాన్ని నిరసిస్తూ ముర్షిదాబాద్‌లో ఆందోళనకారులు నిరసనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో తలపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. సుటి, సంసేర్‌గంజ్, జంగీపూర్‌లలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగిన వారిని చెదరగొట్టామన్నారు. 

జాతీయ రహదారిపై రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. కోల్‌కతాలోని అలియా వర్సిటీ విద్యార్థులు వక్ఫ్‌ చట్టంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా, ముర్షిదాబాద్, నార్త్‌ 24 పరగణాల జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులపై గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ స్పందించారు. హింసకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. హోం మంత్రి అమిత్‌ షాకు పరిస్థితులను వివరించారు. సీఎం మమత ఈ నెల 16న కోల్‌కతాలో ఇమామ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ చెప్పారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో మంగళవారం కూడా ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.  
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)