Breaking News

ముంబైలోనూ నీటి కష్టాలు.. నీటి సరఫరా 15 శాతం కట్‌?

Published on Tue, 03/19/2024 - 09:16

దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా నీటి సరఫరాను ఐదు శాతంమ మేరకు తగ్గించింది. ఈరోజు (మార్చి 19) ముంబైలో నీటి కోత 15 శాతం మేరకు ఉంటుందని ప్రకటించింది. దీంతో  ముంబైవాసులలో ఆందోళన పెరిగింది. 

నిర్వహణ పనుల కారణంగా నీటి సరఫరాను తగ్గించినట్లు బీఎంసీ పేర్కొంది. పౌర సంఘం తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని పైస్ డ్యామ్‌లో నీటి కొరత కారణంగా నగరం అంతటా అదనపు నీటి కోత విధించారు. తాజాగా బీఎంసీ ఒక ప్రకటనలో మహానగరానికి 60 కి.మీ దూరంలో ఉన్న డ్యామ్‌కు భట్సా రిజర్వాయర్ నుండి నీరు వచ్చిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది. 

ఇదిలావుండగా ఆసియాలోని అతిపెద్ద ప్లాంట్‌లలో ఒకటైన భాండూప్‌లోని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌లో క్లీనింగ్ కారణంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ముంబైలో ఐదు శాతం నీటి కోతను బీఎంసీ  ప్రకటించింది. డ్యామ్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గతంలో పది శాతం నీటిని తగ్గించాలని ప్రతిపాదించింది. కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే బెంగళూరులో 14 వేల బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో పాటు చెరువులన్నీ కూడా దాదాపు అడుగంటిపోయాయి. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)