Breaking News

Mumbai: కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు?

Published on Sat, 07/27/2024 - 09:20

మహారాష్ట్రలోని నవీ ముంబైలో మూడంతస్తుల భవనం ‘ఇందిరా నివాస్’ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షాబాజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
 

 

 మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4:35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోతుండటాన్ని గ్రహించిన కొందరు బయటకు పరుగుపరుగున వచ్చారు. అయితే  కొందరు బయటకు రావడం ఆలస్యం కావడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని  స్థానికులు చెబుతున్నారు.

 

ఈ ఘటనలో ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని నవీ ముంబై మునిసిపల్ కమిషనర్  కైలాష్ షిండే తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నదని, కుప్పకూలిన భవనం పదేళ్ల క్రితం నాటిదని అన్నారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)