Breaking News

పోక్సో నిందితుడికి బెయిల్‌.. దేశంలోనే ఇలా తొలిసారి?

Published on Sat, 03/11/2023 - 13:33

ముంబై: పోక్సో కేసులో అరెస్ట్‌ అయిన నిందితుడికి(45).. అదీ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు కాకముందే బెయిల్‌ మంజూరు చేసింది ఓ న్యాయస్థానం. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన కోర్టుగా నిలిచింది ముంబై సెషన్‌ కోర్టు. 

ముంబై వకోలా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. తన మూడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ జనవరి చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు పొరుగింట్లోకి తరచూ వెళ్తుందని, ఈ క్రమంలో తన కూతురిపై పొరుగింట్లో ఉండే వ్యక్తి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. 20 రోజుల తర్వాత విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆమె, తర్వాత మరో రెండు రోజులు ఆగి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో చట్టం ప్రకారం నిందితుడి అరెస్ట్‌ చేశారు పోలీసులు. కానీ,  ఛార్జ్‌షీట్‌ ఇంకా ఫైల్‌ చేయలేదు. సాధారణంగా ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ అయ్యాకే.. బెయిల్‌ విషయంలో కోర్టును ఆశ్రయించొచ్చు.

ఈ లోపు నిందితుడు బెయిల్‌ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించాడు. తన(నిందితుడు) క్లయింట్‌ ఓ ప్రముఖ ఆయిల్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని, ఘటన జరిగినట్లు చెప్తున్న రోజున ఆఫీస్‌లోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నిందితుడి తరపు న్యాయవాది. అంతేకాదు.. రెండు ఇళ్ల మధ్య ఉన్న పైప్‌లైన్‌ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన క్లయింట్‌ను బద్నాం చేసే ఉద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు వాదించాడాయన. 

మరోవైపు.. ప్రాసిక్యూషన్‌ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఈ పోక్సో కేసులో ఛార్జ్‌షీట్‌ కూడా ఇంకా ఫైల్‌ కాలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. నిందితుడు, బాధిత కుటుంబం పొరుగింట్లోనే ఉంటాడు గనుక అతని నుంచి వాళ్లకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉండొచ్చని, కేసును ప్రభావితం చేయొచ్చని వాదించారు. అయితే.. కోర్టు మాత్రం నిందితుడి తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)