కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు
Published on Fri, 07/08/2022 - 15:21
పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్న కొంతమంది చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్లో ఎలాంటి ఉద్విగ్నత, భయం ఆందోళన కనిపించవు. ఆ సంకట పరిస్థితిని సైతం ఆనందంగా మలుచుకుంటారు కొందరూ. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇతను కూడా.
ముంబై గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. నగరాలకు నగరాలు, మునిగిపోవడమే గాక లోతట్టు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వాతావరణ విభాగం(ఐఎండీ) సమీప ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాక బీచ్‌లను సందర్శించడం కూడా నిషేధించింది. ఐతే ప్రస్తుతం ముంబైలో ఒక వైపు రహదారులన్ని వర్షపు నీళ్లతో నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు నానాతంటాలు పడుతుంటే..ఒకడు మాత్రం ఆ వర్షపు నీటిని హాయిగా ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు.
అంతేకాదు అతను ఏదో వేసవి సెలవులకు మాల్దీవులు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వర్షపు నీటిలో పడుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అదికూడా రహదారులపై నిండి ఉన్న వాన నీటిలో పడుకుని ఉన్నాడు. మరోవైపు నుంచి ఆ వ్యక్తి సమీపం నుంచి వాహనాలు నీళ్లను చిమ్ముకుంటూ వెళ్లిపోతున్నాయి. అతను మాత్రం తనకేం పట్టనట్లు తన పని తనదే అన్నట్లు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే ఎందువల్ల అలా పడుకుని ఉన్నాడో అనేది కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
This man feel Maldives in Malad 😄😄bheegi bheegi sadkon par tera intezaar karu …#Mumbaiweather #mumbailocals#MumbaiRains #MumbaiMonsoon pic.twitter.com/AbVJkxKF2L
— 🆂🅷🅰🅷🅸🅳 (@iamshahidkhan42) July 8, 2022
Tags : 1