Breaking News

ముంబై కా హీరో..ప్లాట్‌ఫారమ్‌పై పురుడు పోశాడు!

Published on Fri, 10/17/2025 - 21:27

ముంబై: అమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చూసే ఉంటారు కదా. అందులో ఓ సన్నివేశం మీకందరికి గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌ అక్కకు హీరో ర్యాంచో డెలివరీ చేసి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి నిజజీవిత హీరో గురించే..ఈ హృదయ విదారక సంఘటనను ప్రత్యక్ష సాక్షి మంజీత్ ధిల్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు

ముంబై ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవవేదనతో బాధపడతోంది. తోటి ప్రయాణికులు చోద్యంగా చూస్తున్నారే తప్పా ఎవరూ ముందుకు వచ్చే సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. అదిగో అప్పుడే వందలో ఒక్కడిగా వికాశ్‌ బింద్రే ముందుకు వచ్చాడు. మహిళను ప్రసవం గురించి ఆరా తీశారు. ఆ తల్లి అప్పటికే ప్రసవ ప్రయత్నంలో ఉందని, సగం బిడ్డ లోపల.. మిగితా సగం శరీరం బయటకు ఉందని గుర్తించాడు. వెంటనే వేగంగా సాగుతున్న ట్రైన్‌ చైన్‌లాగాడు. ట్రైన్‌లో నుంచి ఫ్లాట్‌ఫారమ్‌ మీదకు తెచ్చాడు. స్థానికంగా ఆస్పత్రికి సమాచారం అందించాడు. ఆ ఆస్పత్రి వాళ్లు ఆ మహిళకు ప్రసవం చేసేందుకు ముందుకు రాలేదు. 

వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్‌ తీసుకుని మహిళా డాక్టర్‌కు (గైనకాలజిస్ట్‌)కు వీడియో కాల్‌ చేశాడు. పరిస్థితి వివరించారు. వీడియో కాల్‌లో అవతలి నుంచి డాక్టర్‌ చెప్పినట్లు చేశాడు. ప్లాట్‌ఫారమ్‌ మీదనే మహిళకు పురుడు పోశాడు. శభాష్‌ అనిపించుకున్నాడు. తల్లితో పాటు బిడ్డ సురక్షితంగా ఉన్నారు’ అంటూ మంజీత్‌ ధిల్లాన్‌ తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.   

వికాశ్‌కు వైద్య పరిజ్ఞానం లేదు. కానీ మానవత్వం ఉంది. భయపడలేదు. సంకోచించలేదు. ఒక జీవితాన్ని కాపాడాడు. ఇది కేవలం సహాయం కాదు. మానవత్వానికి మచ్చుతునక. అందరూ హీరోలు యూనిఫాంలు ధరించరు. కొందరు మానవత్వం ధరిస్తారు. వికాశ్ బింద్రే అలాంటి వ్యక్తి అంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)