Breaking News

20 మంది పిల్లల కిడ్నాప్‌.. నిందితుడు రోహిత్‌ హతం

Published on Thu, 10/30/2025 - 17:43

ముంబై: 20 మంది పిల్లల్ని కిడ్నాప్‌ చేసిన నిందితుణ్ని పోలీసులు కాల్చి చంపారు. గురువారం ముంబైలోని పోవై ప్రాంతంలో 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు రోహిత్ ఆర్యపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రోహిత్‌ ఆర్య చికిత్స పొందుతూ మరణించాడు. 

తాను నిర్మించనున్న సినిమా,డైలీ సీరియల్స్‌,వెబ్‌ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్య ఓ యాడ్‌ ఇచ్చాడు. ఆ యాడ్‌ చూసిన 100 మందికి పైగా పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్‌ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్‌ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్‌ చేశాడు. వీరి వయస్సు 15 ఏళ్ల లోపే ఉంటుంది.

అయితే, గురువారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో పిల్లలు కిడ్నాప్‌కు గురైనట్లు ‘పోవై’ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్యతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. పిల్లల్ని విడుదల చేసేందుకు రోహిత్‌ అంగీకరించలేదు. పైగా పిల్లల ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాత్రూం ద్వారా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పులకు ముందు పిల్లలు కిడ్నాప్‌కు గురైన ‘పోవై’ స్టూడియోలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిల్లల్ని బంధించిన కిడ్నాపర్‌  ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్‌ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్‌ మార్చి పిల్లల్ని కిడ్నాప్‌ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.

అప్రమత్తమైన పోలీసులు రోహిత్‌ చెర నుంచి పిల్లల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. పిల్లల్ని కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్‌ ఆర్య ఎవరు? పిల్లల్ని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? అన్న కోణం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు