Breaking News

పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్‌

Published on Wed, 12/18/2024 - 17:49

ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్‌కమల్‌’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్‌ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ  మునిగిపోయింది. 

తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్‌ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్‌ పోలీస్‌ బోట్‌లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్‌ కొత్త ఇంజన్‌ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్‌కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్‌ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెప్పారు.

VIDEO CREDITS: NDTV Marathi 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)