Breaking News

ములాయం సింగ్‌ యాదవ్‌ భార్య కన్నుమూత

Published on Sat, 07/09/2022 - 16:45

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు.  ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.

సాధన మరణ వార్తపై స్పందించిన ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య.. యులాయం సింగ్‌, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.  ఈ మేరకు ట్వీటర్‌లో.. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం భార్య సాధన మరణించిన చేదు వార్త తెలిసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు’ ట్వీట్‌ చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విటర్‌లో కూడా పార్టీ వ్యవస్థాపకుడి భార్య మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
చదవండి: ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా

ఎవరీ సాధన
2003లో ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాల్తీ యాదవ్ మరణించే వరకు సాధన గుప్తా గురించి చాలా మందికి తెలియదు. అప్పటికే సాధనా గుప్తాతో సంబంధం కలిగి ఉన్న ములాయం అదే సంవత్సరం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వయసులో అతని కంటే సాధన 20 ఏళ్లు చిన్నది. ఆమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రతీక్ యాదవ్ ఆమె కుమారుడు కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)