Breaking News

‘అన్సారీకి విషమివ్వలేదు.. గుండెపోటుతోనే మృతి’

Published on Mon, 09/16/2024 - 12:01

బండా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్ అన్సారీ మృతిపై తలెత్తుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. అన్సారీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ ముగిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విచారణ నివేదికను సమర్పించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు మెజిస్టీరియల్ విచారణలో వెల్లడయ్యింది.

ముఖ్తార్ అన్సారీ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో వీటికి చెక్‌ పెట్టేందుకు  జిల్లా మేజిస్ట్రేట్  అధ్యక్షతన విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక వచ్చిన దరిమిలా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించిన వివరాలు పంపారు. అయితే దీనిపై వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్తార్ కుటుంబానికి పంపిన నోటీసులో ఆయన మృతిపై ఉన్న అభ్యంతరాలు లేదా సాక్ష్యాలను సమర్పించడానికి కొంత గడువు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు. విచారణ నివేదికను 10 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించారు.

గతంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం మార్చి 28న క్షీణించింది. దీంతో జైలు నిర్వాహకులు అతన్ని బండా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాడు ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదికలో అతని మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొంది. అయితే ముఖ్తార్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ముక్తార్‌కు స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో బండా జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: మెట్రో స్టేషన్‌ వద్ద కాల్పులు.. యువకుని మృతి

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)