గురుదక్షిణగా ఐసీటీకి  రూ.151 కోట్ల విరాళం 

Published on Sun, 06/08/2025 - 05:46

న్యూఢిల్లీ:  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ ముకేశ్‌ అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబైలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన 1970వ దశకంలో ఇక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థను యూనివర్సిటీ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(యూడీసీటీ)గా పిలిచేవారు. 

ముకేశ్‌ అంబానీ శుక్రవారం ఐసీటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తమ ప్రొఫెసర్‌ శర్మ బోధించిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ప్రొఫెసర్‌ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన దేశం అన్ని రకాల సవాళ్లను అధిగమించి గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలని తన తండ్రి ధీరూబాయ్‌ అంబానీ తరహాలోనే ప్రొఫెసర్‌ శర్మ కూడా ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. 

ప్రైవేట్‌ పారిశ్రామికవేత్తలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్‌ శర్మ కృషి వల్లే ఐసీటీ అత్యున్నత విద్యాసంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్‌ శర్మను ‘భారత్‌ గురు’గా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్‌ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేరి్పన ఐసీటీకి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)