Breaking News

మొఘల్‌ దర్బార్‌లో క్రిస్మస్ సందడి.. మామిడాకులతో అలంకరణలు

Published on Wed, 12/24/2025 - 12:17

దేశంలో క్రిస్మస్‌ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే పాత ఢిల్లీలోని ఆ ప్రాంతంలో జరిగే క్రిస్మస్‌ వేడుకులకు ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ క్రిస్మస్‌ అంటే అది కేవలం క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు... మొఘల్ సంప్రదాయం, క్రైస్తవ విశ్వాసాల అద్భుత కలయిక. చక్రవర్తి అక్బర్ కాలంలో జెస్యూట్ మిషనరీల రాకతో మొదలైన ఈ వేడుకలు నేటికీ ‘ఈద్ ఎ తవల్లుద్’ పేరుతో వేడుకలు కొనసాగుతున్నాయి. మొఘల్ చక్రవర్తులు దసరాను ఏవిధంగా గౌరవించారో, జహంగీర్ తదితర పాలకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, ఆనాడే మత సామరస్యానికి పునాది వేశారు.

ఢిల్లీలోని తుర్క్‌మెన్ గేట్ -కశ్మీరీ గేట్ ప్రాంతాలు ఈ చారిత్రక వేడుకలకు ప్రధాన వేదికలు. ఇక్కడి 1836 నాటి సెయింట్ జేమ్స్ చర్చి , ఉర్దూలో ప్రార్థనలు జరిగే సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి పాత ఢిల్లీలో బహుళ సంస్కృతికి నిదర్శనాలు. కాలక్రమేణా అనేక ఆంగ్లో-ఇండియన్ కుటుంబాలు ఇక్కడి నుండి వలస వెళ్లినా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ‘తుర్క్‌మెన్ గేట్’కు తమ మూలాలను వెతుక్కుంటూ రావడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక్కడి క్రిస్మస్ అలంకరణలు, ఆచారాల్లో అచ్చమైన భారతీయత కనిపిస్తుంది.

చర్చిలను కేవలం స్టార్లతోనే కాకుండా, అరటి, మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరిస్తారు. పాశ్చాత్య కరోల్స్ (కీర్తనలు) ఇక్కడ ఉర్దూ, పంజాబీ బాణీల్లో వినిపిస్తూ ప్రత్యేక అనుభూతినిస్తాయి.  క్రిస్మస్‌ వేళ ఇక్కడ భోజన ప్రియులకు పసందైన విందు దొరుకుతుంది. ఇక్కడి ఇళ్లలో మొఘలాయి రుచులైన బిర్యానీ, కబాబ్‌లను వండి వడ్డిస్తారు. వీటితో పాటు పలు రకాల సంప్రదాయ స్వీట్లు తయారుచేస్తారు. ఇ‍క్కడి బేకరీలు క్రిస్మస్‌ కేకులతో కళకళలాడుతుంటాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడివారంతా పొరుగువారితో ఖీర్ పంచుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ క్రిస్మస్‌  వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘విజయ్‌తో రాహుల్‌’.. సీక్రెట్‌ వెల్లడించిన టీవీకే నేత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)