Breaking News

‘అప్పడం లాంటి రోటీ, కంపు పన్నీర్‌’.. ఎంపీ భార్య ఫిర్యాదుకు ఐఆర్‌సీటీసీ షాకింగ్‌ ఆన్సర్‌

Published on Tue, 07/15/2025 - 10:13

న్యూఢిల్లీ: రైళ్లలో ఐఆర్‌సీటీసీ అందించే ఆహారంపై అప్పుడప్పుడు పలు విమర్శలు వినిపిస్తుంటాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తమకు వడ్డించిన ఆహారం బాగోలేదంటూ విమర్శించారు. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అనితా సింగ్.. రైలు ఆహారం విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. రోటీ  అప్పడంలా ఉందని, పన్నీర్‌ పాచిపోయిందని, పప్పు.. నీళ్లగా ఉందని పేర్కొన్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సీటీసీ ప్రీమియం రైలుగా చెబుతున్నప్పటికీ, క్యాటరింగ్ ప్రమాణాలు అందుకు అనువుగా లేవని అనితా సింగ్‌ వ్యాఖ్యానించారు.  ఆమె తన పోస్ట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖను, మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు.

ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్సందించిన ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటన విడుదల  చేస్తూ,  ఆహారం వడ్డించే ముందు సిబ్బంది దానిని తనిఖీ చేస్తారని, ఆ రోజు అదే కోచ్‌లోని ఇతర ప్రయాణీకుల నుండి  ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొంది.  అయితే అనితా సింగ్‌ అభిప్రాయాన్ని విలువైనదిగా  పరిగణిస్తున్నామని తెలిపింది. కాగా ఆమె సోషల్‌ మీడియా పోస్టుకు యూజర్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సమస్యను అంగీకరించే బదులు, ఐఆర్‌సీటీసీ తనను తాను సమర్థించుకుంటోందని కొందరు వ్యాఖ్యానించారు. తేజస్, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో కూడా ఆహారం బాగుండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు