Breaking News

‘పోయింది అనుకున్న మ్యాచ్‌ గెలిచారు.. నన్ను క్షమించండి’

Published on Mon, 08/04/2025 - 20:23

ఇంగ్లండ్‌పై ఓవల్‌ వేదికగా అనూహ్య విజయం సాధించిన టీమిండియాపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసలు కురిపించారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కొనియాడారు.  మన చేతుల్లో మ్యాచ్‌లో లేదు.. పోయింది అనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతం చేశారన్నారు. తాను కూడా మ్యాచ్‌ మన నుంచి చేజారిపోయిందనే అనుకున్నానని, అయితే అది తప్పు అని నిరూపించి మన ఆటగాళ్లు అద్భుతమే సృష్టించారని పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మ్యాచ్‌ ఓడిపోయే అవకాశం ఉందని తాను చెప్పిన దానికి బదులుగా టీమిండియా సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు శశిథరూర్‌.

 

‘మ్యాచ్‌ను టీమిండియా కోల్పోతుందనే అనుకున్నా.  ఓటమి ఖాయమని చెప్పాను. అయితే అది తప్పైంది. మన మీద మనం నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టించవచ్చనే దానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి’ అంటూ శశిథరూర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ ద్వారా ట్వీట్‌ చేశారు. ఇంగ్లండ్‌తో చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠగా సాగిన  ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచనల విజయం సాధించింది.

లార్డ్స్ టెస్టులో బ్యాట్‌తో జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయిన సిరాజ్‌.. ఓవ‌ల్‌లో మాత్రం బంతితో త‌న జ‌ట్టుకు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఈ కీల‌క పోరులో సిరాజ్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బుమ్రా లేని లోటును తెలియ‌నివ్వ‌లేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టెస్టులో విజయం సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి