Breaking News

ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ

Published on Tue, 10/03/2023 - 19:25

ముంబై: మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు.    

మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య మరో 24 గంటలు గడిచేసరికి 31కి చేరింది. వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు గెలువడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.    

ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం తోపాటు ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే మరణాలు జరిగాయన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వారే వైద్యానికి సరిగ్గా స్పందించడంలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కూడా అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో షిండే ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

     

వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేయగా అక్కడి టాయ్‌లెట్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రి డీన్‌ను పిలిపించి ఆయనతోనే ఆ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయించారు. ఎంపీ అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మరణాలపై దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించామని వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డా.దిలీప్ మైసెఖర్ తెలిపారు.  

ఇది కూడా చదవండి: అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)