Breaking News

136 ఏళ్ల నాటి బ్రిటీష్‌ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ

Published on Sat, 04/22/2023 - 21:24

ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్‌ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్‌లో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్‌ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్‌లోని దామోహ్‌ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్‌ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది.

తాను ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు.  పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది.

అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి  జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

(చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్‌': న్యాయశాఖ మంత్రి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)