Breaking News

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

Published on Thu, 04/20/2023 - 17:53

ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి  పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో గురువారం భేటీ అయిన వెంకట్‌రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

  • భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం 
  • యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
  • యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్‌ కు రాకపోకలు సాగిస్తుంటారు. 
  • జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది.
  • ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు.
  • ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది.
  • ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి.


రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి

  • ఎంఎంటీఎస్‌ ను ఘట్‌‌ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది.
  • ఎంఎటీఎస్‌ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు.
  • కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)