Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన

Published on Tue, 02/11/2025 - 08:28

ఆ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ. 3,000 తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ‘లాడ్లీ బహనోం’ యోజన కింద రాష్ట్రంలోని 1.27 మహిళల ఖాతాల్లోకి  రూ. 1553 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసిన సీఎం ఈ ప్రకటన చేశారు.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా పీపల్‌రవా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఇక చింతించవసరం లేదన్నారు. తాము ప్రవేశపెట్టిన ‘లాడ్లీ బహనోం’ పథకంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని, మహిళల ఖాతాల్లోకి ప్రతీనెలా డబ్బులు వేయరని చెబుతున్నారని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని విడిచిపెట్టబోమన్నారు. ఇదేవిధంగా తాము రాష్ట్రంలోని 74 లక్షల సోదరీమణులు ఖాతాల్లోకి గ్యాస్‌ సిలిండర్ల మొత్తాన్ని నెలకు రూ. 450 చొప్పున జమచేస్తున్నామన్నారు.  

ఇప్పటివరకూ రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1,250 మొత్తాన్ని ఇస్తూ వచ్చామని, దీనిని రూ. 3000 వరకూ  పెంచుతామని ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో సీఎం 56 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ఖాతాల్లోకి రూ. 337 కోట్లను, 81 మంది రైతుల ఖాతాల్లోకి 1,624 కోట్లను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. రూ. 144.84 కోట్ల విలువైన 53 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం మోహన్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. 

ఇది కూడా చదవండి: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్‌.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)