Breaking News

వాయు కాలుష్యంపై వార్ ప్రకటించాలి: ఎంపీ అయోధ్య రామిరెడ్డి

Published on Tue, 12/02/2025 - 12:39

ఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యంపై రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్ఆర్ సిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పంధించారు. దీన్ని  జాతీయ రాజకీయ, సామాజిక ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి. కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది ఆరోగ్య ఆర్థిక పరమైన సమస్య. వాయు కాలుష్యంతో మన దేశం ప్రతి ఏడాది మూడు శాతం జీడీపీని కోల్పోతుంది. ప్రజలపై వైద్య చికిత్సల భారం పడి ఉత్పాదకతను కోల్పోతున్నారు. కాలుష్యంతో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు.

ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. కాలుష్య నియంత్రణకు తగిన పాలసీ రూపొందించి కఠిన చర్యలు అమలు చేయాలి. వ్యర్ధాల నిర్వహణ, పవర్ ప్లాంట్ కంట్రోల్ , ఎయిర్ క్వాలిటీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలి. జాతీయ సామాజిక, రాజకీయ ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోవాలి. కాలుష్యం నియంత్రణకు రియల్ టైం డేటాతో తగిన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇక్కడ ప్రతి ఏడుగురిలో ఒకరు అకాల మరణ ముప్పును కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్నారు.

గతేడాది 17 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. వాహన కాలుష్యం ,పంట వ్యర్ధాల దహనం, నిర్మాణ పనుల వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది. ఈ తరహాలోనే విశాఖపట్నంలో కూడా పీఎం 10 లెవెల్స్ గడిచిన ఏడేళ్లలో 32.9 శాతం పెరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం కింద ఏపీకి 129.4 కోట్లు కేటాయిస్తే 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కింది స్థాయిలో పర్యవేక్షణ లోపం,  అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం,స్థానిక యంత్రాంగ పట్టించుకోకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని అయోధ్య రామిరెడ్డి అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)