Breaking News

ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్‌ హైకోర్టు

Published on Thu, 04/17/2025 - 19:52

లక్నో:  గృహ హింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కుటుంబంలోని ప్రతీ స్త్రీకి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది.  కేవలం అది కోడలకు మాత్రమే నిర్దేశించిన  చట్టం మాత్రమే కాదని, అత్తకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. తనకు కోడలు పెట్టే గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 

అది కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిన చట్టం మాత్రమే కాదని, కుటుంబంలో ఎవరైనా స్త్రీ దీనికి అర్హులేనని పేర్కొంది. జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గృహ హింస ఫిర్యాదులో తన అత్త దాఖలు చేసిన  పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను  కోడలు, ఆమె తరుఫు బంధువులు సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లారు.  ఇకడ కోడలు పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్‌ హైకోర్టు.. మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును  జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు సమర్ధించింది. 

అది కేవలం కోడళ్ల చట్టమంటూ హైకోర్టుకు..
ఆ   చట్టం అనేది కేవలం కోడళ్లకి మాత్రమే ఉద్దేశించబడినదంటూ హైకోర్టుకు వెళ్లింది కోడలు. గృహ హింస చట్టం అనేది కోడళ్లకు మాత్రమే చేయబడిదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై  మేజిస్ట్రేట్ తీర్పును సవాల్‌ చేసింది.  దీన్ని కొట్టివేసేన హైకోర్టు,..గృహ హింసకు గురయ్యే ప్రతీ  మహిళకి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. ఇది కేవలం కోడళ్లకి మాత్రమే చేయబడిన చట్టం కాదని చురకలంటించింది. డీసీ(డొమస్టిక్ వయెలెన్స్) చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని  ఏ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని తెలిపింది.

ఇంతకీ కేసు ఏంటంటే..!
యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళ సుధా మిశ్రాను వేధింపులకు గురి చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. రాయబేరీలోని సొంత ఇంటి నుంచి వెళ్లిపోదామని భర్తపై గరిమా పదే పదే ఒత్తిడి తెచ్చింది. దాన్ని తన కొడుకు తిరస్కరించడంతో తనపై కోడలు వేధింపులు  అధికమైనట్లు అత్త సుధా మిశ్రా పేర్కొంది.. అదే సమయంలో తన  ఇంటి నుంచి కోడలు గరిమా, ఆమె తరఫు బంధులతో కలిసి బలవంతంగా డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపింది.  దీనిపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు