Breaking News

డబ్బు ఇస్తేనే తల్లికి అంత్యక్రియలు

Published on Fri, 03/07/2025 - 10:56

బెంగళూరు: తల్లి చనిపోయిందనే బాధ కూడా వారికి లేదు. తమ వాటా డబ్బు ఇస్తేనే అంత్యక్రియలకు అంగీకరిస్తామని కర్కోటక కుమారులు అమానుషంగా వ్యవహరించారు. దీంతో మృతురాలి కుమార్తెల బిడ్డలు తమ అవ్వ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దార్‌ జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదంతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని దొడ్డకురుగోడులో జరిగింది. గ్రామానికి చెందిన అనంతక్కకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

భర్త మృతితో అనంతక్క మధుగిరి తాలూకా కడగత్తూరులో ఉన్న కుమార్తెల వద్ద ఉంటోంది. భర్తద్వారా ఆమెకు సంక్రమించిన భూమిని ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించి రూ.93 లక్షలు అందజేసింది. ఆ మొత్తంలో 40 లక్షలు కుమార్తెలు తీసుకున్నారు. ఈక్రమంలో వృద్ధాప్యం కారణంగా అనంతక్క మంగళవారం తన కుమార్తె ఇంటిలోనే మృతి చెందింది. భర్త సమాధి పక్కనే తనను ఖననం చేయాలని అనంతక్క గతంలోనే కుమార్తెకు తెలియజేసింది.

దీంతో మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకురాగా కుమారులు అడ్డుకున్నారు. తల్లి నుంచి కుమార్తెలు తీసుకున్న రూ.40లక్షలు తిరిగి ఇస్తేనే అంత్యక్రియలకు సహకరిస్తామని మొండికేశారు. దీంతో అనంతక్క మృతదేహాన్ని కుమార్తెలు, మనువరాండ్రు పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది. బుధవారం ఉదయం తహసీల్దార్‌ మహేపత్రి  స్పందించి అనంతక్క కుమారులను పిలిపించి సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)