Breaking News

కన్నపేగు ఎంత కఠినం?

Published on Tue, 09/23/2025 - 11:37

సాక్షి, బళ్లారి: మొదటి కాన్పు, రెండవ కాన్పులో ఆడపిల్లలే పుట్టారు, మూడవ కాన్పులో మగపిల్లవాడు పుడతాడని భావించిన తల్లి ఆడపిల్ల పుట్టిందని పేగుబంధాన్ని తెంచుకుని, ఆ బిడ్డను తుంగభద్ర కాలువలోకి విసిరేసింది. బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా తోరణగల్లులో ప్రియాంక దేవి అనే కఠినాత్మురాలు ఈ ఘోరానికి ఒడిగట్టింది. ఆమె భర్త సనోజ్‌కుమార్‌ జిందాల్లో ఉద్యోగి, బిహార్‌ కి చెందిన ఈ దంపతులు తోరణగల్లులో ఉంటున్నారు. 

రెండు నెలల కిందట ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆనాటి నుంచి కోపంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువన పసిపానను నీటి కాలువలోకి పడేసింది. ఏమీ తెలియనట్లు తోరణగల్లు పోలీస్టేషన్‌లో బిడ్డ కనిపించడంలేదని విలపిస్తూ నటించింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తల్లి కాలువ వద్దకు తీసుకెళ్తున్న దృశ్యం çకనిపించింది. కసాయి తల్లిని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం శిశువు శవం దొరికింది. 

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు