Breaking News

Ganesh Chaturthi: దేశంలోని ఆరు ప్రముఖ మండపాలు.. రెండు తెలంగాణవే..

Published on Thu, 08/28/2025 - 12:08

ముంబై: దేశంలో నిన్న(ఆగస్టు 27)న మొదలైన గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పిల్లాపెద్దా అంతా కలిసి వినాయక మండపాలలో సందడి చేస్తున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీలు పడీ భారీ విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేశాయి. ఈ ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడు అ‍త్యంత భారీ గణపతులను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తుంటారు. అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో రెండు ప్రముఖ గణపతులు తెలంగాణకు చెందినవే కావడం విశేషం.

1. లాల్‌బాగ్చా రాజా, లాల్‌బాగ్, ముంబై

‘ముంబై రాజు’గా పేరొందిన లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ పాలకుల కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. నేత కార్మికులకు నిలయమైన ఈ ప్రాంతంలో కొలువైన ఈ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 10 రోజుల గణపతి ఉత్సవాల్లో లాల్‌బాగ్చా రాజాను ప్రతిరోజూ సగటున 15 లక్షల మంది  సందర్శిస్తుంటారు.

2. దగ్డుషేత్ హల్వాయి, పూణే

భారతదేశంలో అత్యంత ఖరీదైన గణేశ్‌ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారని చెబుతారు. దేశంలోనే అత్యంత ఖరీదైన  గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు భీమా కవరేజ్ కోటి రూపాయలకు చేరుకుంది.

3. ఖైరతాబాద్ గణేశుడు, హైదరాబాద్

హైదరాబాద్‌(తెలంగాణ)లోని ఖైరతాబాద్ గణేశుడు..అత్యంత ఎత్తయిన గణనాథునిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తుంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖరతాబాద్‌ గణేశుణ్ణి దర్శించుకుంటారు.  

4. జీఎస్‌బీ సేవా మండల్, ముంబై

ముంబైలోని కింగ్ సర్కిల్‌లో జీఎస్‌బీ సేవా మండల్  60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ గణేశుని విగ్రహం పర్యావరణ అనుకూలమైనదని చెబుతుంటారు. ఇ‍క్కడికి వచ్చే భక్తుల సంప్రదాయ దుస్తులు ధరించి రావాలనే నిబంధన ఉంది. ఈ గణపతికి ఐదు రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి.

5. బాలాపూర్ గణేశుడు, హైదరాబాద్

హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ మండపం ఎంతో పేరొందింది. లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెంది​ంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తుంటారు.

6. చించ్‌పోక్లి చ రాజా, ముంబై

చింతామణి గణపతి లేదా చించ్‌పోక్లి చ రాజా గా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలో ఎంతో పేరొందింది. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)