Breaking News

హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి!

Published on Mon, 12/25/2023 - 12:33

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు  పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. 

సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్‌ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య  అంతకంతకూ పెరుగుతోంది.

మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం  తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం  పలు హోటళ్ల యజమానులకు సూచించింది. 
ఇది కూడా చదవండి: బూస్టర్‌ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)