20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. టెన్షన్‌లో పేరెంట్స్‌

Published on Fri, 07/18/2025 - 10:39

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో దాదాపు 20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. తనిఖీలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాఠశాళలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం ఉదయమే పశ్చిమ్‌ విహార్‌, రోహిణీ సెక్టార్‌-3లోని పలు పాఠశాలలతో సహా దాదాపు 20 స్కూల్స్‌ బాంబు బెదిరింపు మొయిల్స్‌ వచ్చాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పలు పాఠశాల్లలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి.. తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో నాలుగు రోజుల వ్యవధిలో 30కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారం మొదటి మూడు రోజుల్లో ఢిల్లీలోని 11 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, స్కూల్‌ యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు.

బీజేపీ సర్కార్‌పై మాజీ సీఎం ఫైర్‌.. 
దేశ రాజధాని వరుస బాంబు బెదిరింపుల విషయమై అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి అతిషి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతిషి ట్విట్టర్‌ వేదికగా.. ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి!. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బాధను ఆలోచించండి. ఢిల్లీలోని నాలుగు పాలనా యంత్రాలను బీజేపీ నియంత్రిస్తుంది. ఇంకా మా పిల్లలకు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది!. ఇది దిగ్భ్రాంతికరం! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)