Breaking News

అయ్యో బిడ్డా.. మరీ ఇంత అనాగరికమా?

Published on Sat, 02/04/2023 - 07:14

క్రైమ్‌: దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందుపై అనాగరిక చర్యకు దిగారు గిరిజన పెద్దలు. దీంతో సకాలంలో చికిత్స అందక.. ఆ చిన్నారి పదిహేను రోజులు పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది. 

షాహ్‌దోల్‌ జిల్లా పరిధిలోని ఓ గిరిజన తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి.. నాటు వైద్యం పేరుతో 51 సార్లు కాల్చిన కడ్డీతో కడుపు మీద వాతలు పెట్టారు తండా పెద్దలు. అయితే అది వికటించి.. బిడ్డ ప్రాణం మీదకు వచ్చింది. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. 

ఇదిలా ఉంటే.. చిన్నారి కన్నుమూసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. చిన్నారి మృతదేహాన్ని బయటకు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సకాలంలో న్యూమోనియాకు చికిత్స అందకపోవడం, పైగా కడ్డీ కాల్చిన గాయాల ప్రభావంతో బిడ్డ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది స్పందించారు. ఆ బిడ్డ తల్లికి వద్దని చెప్పినా పట్టించుకోకుండా.. ఆ చర్యకు దిగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ గిరిజన ప్రాంతాల్లో ఇలా జబ్బులకు కడ్డీలను కాల్చి వాతలు పెట్టడం కొందరు ఆచారంగా భావిస్తారు. అయితే ఈ విధానం జబ్బును నయం చేయకపోగా, గాయాలకు కారణం అవుతోందని.. ఒక్కోసారి ఉన్న సమస్యలే ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరణాలకు సైతం దారి తీస్తోందని స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు. అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. వాళ్లు మాత్రం ఆచారాలు కొనసాగిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వందనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)