జులైలో వర్షాలు ఊరటనిచ్చినా.. ఏం జరిగిందో తెలుసా?

Published on Tue, 07/28/2026 - 17:11

భారత్‌లో జులై నెల దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ, నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం మీద వర్షపాత లోటు 15 శాతం వద్దే కొనసాగనుంది. జులైలో వర్షపాతం తీవ్ర హెచ్చుతగ్గులు చూసింది. తొలి వారం అత్యధిక వర్షాలు, రెండో వారం పొడి వాతావరణం, జూలై 21 నుంచి 24 మధ్య మరోసారి భారీ వర్షాలు కురవడంతో నెలవారీ వర్షపాత లోటు తొలగిపోయింది.

"జులైలో ఇప్పటివరకు వర్షపాతం స్వల్పంగా సాధారణ స్థాయిలోనే ఉంది. నెల ముగిసే నాటికి దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉంది. నెలాఖరు వరకు రోజుకు 9-9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది" అని స్కైమెట్ వాతావరణ సంస్థ తెలిపింది.

జూలై తొలి వారంలో భారీ వర్షాలతో మాన్సూన్ బలంగా ప్రారంభమైంది. దీంతో సీజనల్ వర్షపాత లోటు 40 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది. అయితే రెండో వారంలో దీర్ఘకాలం పొడి వాతావరణం కొనసాగడంతో సీజనల్ లోటు మళ్లీ 24శాతానికి పెరిగింది.

జులై 21 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవడంతో పరిస్థితి మళ్లీ మెరుగుపడింది. జూలై నెల వర్షపాత లోటు పూర్తిగా తొలగిపోయి, సీజనల్ లోటు 15 శాతానికి తగ్గింది. నెలాఖరుకు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, రాజస్థాన్‌పై ఉన్న చక్రవాత ప్రసరణ ప్రభావంతో నెల చివరి రోజుల్లో పెద్ద స్థాయిలో వర్షపాత లోటు ఏర్పడే అవకాశం లేదని సంస్థ తెలిపింది. జులైలో వర్షపాతం మెరుగుపడినప్పటికీ, వర్షాకాలం మొత్తం మీద ఉన్న 15 శాతం లోటు సీజన్ రెండో భాగంలో భర్తీ అవుతుందనే స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదని స్కైమెట్ పేర్కొంది.

భవిష్యత్ వర్షపాత పరిస్థితి ప్రధానంగా బలపడుతున్న ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) పరిణామాలపై ఆధారపడి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇవి భారత వర్షాకాలంపై భారీగా ప్రభావం చూపే రెండు ప్రధాన వాతావరణ కారకాలు. "సీజనల్ వర్షపాత పరిస్థితిపై మరింత స్పష్టత ఆగస్టు తొలి వారంలో వచ్చే అవకాశం ఉంది" అని స్కైమెట్ తెలిపింది.

రానున్న 10 రోజుల్లో తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత ప్రాంతాల్లో విస్తృతంగా, సమయానుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు మధ్య భారత ప్రాంతాల్లో మాన్సూన్ బలహీన దశ కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, ముఖ్యంగా అంతర్గత ప్రాంతాలు, ఆగ్నేయ ప్రాంతాల్లో వర్షాల కొరత కొనసాగనుంది. ఈ కాలంలో గణనీయమైన వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదు.

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)