Breaking News

Monkey Fever: మం​కీ ఫీవర్‌ కలకలం.. కర్ణాటకలో రెండు మరణాలు

Published on Mon, 02/05/2024 - 08:30

సాక్షి, బెంగళూరు: కర్ణాటకను మంకీ ఫీవర్‌ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వివరాల ప్రకారం.. మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందారు. జనవరి 8న సదరు యువతి చెందింది. ఇక, ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)