Breaking News

4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్‌ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..

Published on Thu, 06/22/2023 - 17:16

భోపాల్‌: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్‌ ఉన్న ‘మోస్ట్‌ వాంటెడ్‌’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. 

ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్‌ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్‌ చొరవతో  ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

ఎలా పట్టుకున్నారంటే!
జిల్లా కలెక్టర్‌ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్‌ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.

చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి