రౌడీ కోతిని పట్టుకునేందుకు అటవీ అధికారులు క్యాంపు 

Published on Sat, 07/25/2026 - 01:03

విల్లుపురం: ఒకే ఒక్క కోతి.. దాదాపు మూడు నెలల నుంచి ఆకస్మికంగా దాడులు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిన్నారులపై దాడులు చేస్తోంది. ఇటీవల ఓ బాలిక చెవి కొరికేసింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ రౌడీ వానరాన్ని బంధించేందుకు గ్రామంలోనే ఏకంగా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. పలు చోట్ల బోన్లను అమర్చారు. అవసరమైతే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ల బృందాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. 

ఒకట్రెండు రోజుల్లోనే ఆ వానరం చిక్కడం ఖాయమని ధీమాతో చెబుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరుతెరి గ్రామంలో ఓ వానరం చిన్నారులు, ఆ దారిని వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. ఈ నెల 21వ తేదీన 8వ తరగతి చదివే బాలికపై పడి, చెవి కొరికేసింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆ వానరం ఒంటరిగానే సంచరిస్తోందని, ఏదైనా సర్కస్‌ కంపెనీకి చెందనది అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)