Breaking News

సిద్ధూపై ఈడీ కేసు

Published on Tue, 10/01/2024 - 03:22

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) ఆధారంగా ఈ చర్యకు దిగింది. 

సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెçహ్లాట్‌ అనుమతి మంజూరు చేశారు. 

దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్‌ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్‌ చేయవచ్చు. 

14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా 
ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ 
మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్‌ ఫేజ్‌–3, ఫేజ్‌–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. 

‘సేల్‌ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం  తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)