Breaking News

కుప్పకూలిన బిల్డింగ్‌.. 12 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

Published on Sun, 12/22/2024 - 08:04

చంఢీగడ్‌ : పంజాబ్‌ రాష్ట్రం మొహాలి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలింది. సహాయక చర్యలు 12 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.     

మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్‌మెంట్‌ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని సంరక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు.  

భవనం కూలిపోవడంపై పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు.  బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)