Breaking News

26న కార్గిల్‌కు ప్రధాని మోదీ.. భారత విజయ రజితోత్సవాలకు హాజరు

Published on Mon, 07/22/2024 - 12:27

పాకిస్తాన్‌తో 1999లో జరిగిన యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్‌లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. తాజాగా లధాక్‌ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా ప్రధాని పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాలను పరిశీలించారు.

భారత విజయ రజితోత్సవాల సందర్భంగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్‌లో జూలై 24 నుంచి 26 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శిస్తారని, కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ద్రాస్ హెలిప్యాడ్ వద్ద భద్రత, స్వాగతం, మోదీ కాన్వాయ్‌కు అవసరమైన ఏర్పాట్లు, స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించే విధానం తదితర కార్యక్రమాల సన్నాహాలపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.

జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్‌లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని, ఆ తర్వాత షహీద్ మార్గ్(వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని ఆయన తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)