Breaking News

మోదీ వారంటీ ఎక్స్‌పైర్ అవుతుంది..: జైరాం రమేష్

Published on Tue, 03/12/2024 - 20:27

'మోదీ కి గ్యారెంటీ' అనే బీజేపీ నినాదంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట 'గ్యారెంటీ' అనే పదాన్ని వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఉపయోగించారని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వారెంటీ గడువు ముగియబోతోందని జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్నాయి. గ్యారెంటీ అనే మాట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించారని ఆయన అన్నారు.

మోదీ కి గ్యారెంటీ అనే పదం జూలై 26న ఢిల్లీలో భారత మండపాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రధాని మొదట ఉపయోగించారు. ఇదే నేడు బీజేపీ వారంటీగా మారిపోయింది. ఇప్పటికే మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు.

బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 'జన గర్జన్ సభ' ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 'మోదీ కి గ్యారెంటీ' జీరో వారెంటీ అని, మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే హామీలను నిలబెట్టుకుంటాయని అభిషేక్ అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)