Breaking News

ప్రధాని మోదీకి బైడెన్‌ ఫోన్‌.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై చర్చ

Published on Tue, 08/27/2024 - 09:24

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రపంచంలోని వివిధ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని అన్నారు.

బంగ్లాదేశ్‌, ఉక్రెయిన్‌లలో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునితో చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చే విషయంలో భారత్‌ మద్దతు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో.. ‘మేము ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితితో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు జరిపాం. శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు భారతదేశ మద్దతును  పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా చర్చించాం. త్వరలోనే  సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాం. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాలని కోరాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌, యూఎస్‌ల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్‌కు ఉన్న నిబద్ధతను మోదీ ప్రశంసించారు. ఈ ఫోను సంబాషణలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన కీవ్ పర్యటన గురించి అమెరికా అధ్యక్షునికి వివరించారు. తాను అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని తెలిపారు. దౌత్యానికి అనుకూలంగా భారతదేశ కట్టుబాటును, స్థిరమైన వైఖరిని ప్రధాని మరోమారు పునరుద్ఘాటించారు.
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)