Breaking News

పదేళ్ల ‘మన్‌ కీ బాత్‌’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం

Published on Sun, 09/29/2024 - 12:19

న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో  ఎన్నో మైలురాళ్లు  ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి  సహచరులగా మారారు. వారి నుండి నేను  ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.

‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో  ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సర్జికల్‌ స్ట్రైక్‌: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)