Breaking News

నిర్భయ నాయకత్వానికి నేతాజీ ప్రతీక :మోదీ

Published on Fri, 01/23/2026 - 08:20

నేతాజీ సుభాష్ చంద్రబోస్  నిర్భయమైన నాయకత్వానికి, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్మృతులతో కూడిన ప్రత్యేక వీడియోను తన ఎక్స్ ఖాతాలో జోడించారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ "నేతాజీ జయంతిని మనం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా ఆయన అజేయమైన సంకల్పాన్ని, దేశానికి చేసిన అసమానమైన సేవలను స్మరించుకుందాం. నిర్భయమైన నాయకత్వానికి అచంచలమైన దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఆయన ఆలోచనలు దేశాన్ని ధృడంగా నిలపడంలో ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి" అని మోదీ అ‍న్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జన్మించారు.  పిన్న వయస్సులోనే ఐసీఎస్ ( ప్రస్తుత సివిల్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అయినప్పటికీ తన దేశవాసులు పడుతున్న కష్టాలు చూసి ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని  భారత ప్రభుత్వం 2021 నుంచి జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా జరుపుతుంది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)