Breaking News

మోదీ హామీలు చైనా వస్తువులు లాంటివి: తేజస్వి యాదవ్

Published on Sun, 03/31/2024 - 20:26

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా దేశ రాజధాని నగరంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో RJD నాయకుడు తేజస్వి యాదవ్.. ప్రధాని 'నరేంద్ర మోదీ'పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివని, అవన్నీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఉద్దేశించినవని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అలాంటి హామీల మాయలో ప్రజలు పడవద్దని కోరారు. దేశంలో ఇప్పుడు 'ప్రకటించని ఎమర్జెన్సీ' నెలకొందని ఆరోపించారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడానికి ప్రతిపక్షాలు అనుమతించవని నొక్కి చెప్పారు.

ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించారు. హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విధానాన్ని అందరూ చూసారు. బీజేపీ బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఒక సింహాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మేము కూడా సింహలమే.. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని యాదవ్ అన్నారు.

ప్రజలు తగిన గుణపాఠం చెబితే మోదీ అధికారంలోకి రారు. ఈ ఉదయం బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేసే కార్యక్రమంలో.. రాష్ట్రపతి అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నప్పుడు, మోడీ జీ అద్వానీ జీ పక్కన కూర్చున్నారు కానీ రాష్ట్రపతి గౌరవార్థం కూడా నిలబడలేదని అన్నారు.

దేశం నలుమూలల ఉన్న ఇండియా కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సోదరభావాన్ని కాపాడేందుకు కూటమి ఐక్యంగా ఉందని యాదవ్ అన్నారు. ప్రజలే నిజమైన గురువులు.. దేశాన్ని ఎవరు పాలించాలో మీరే నిర్ణయించుకోవాలని యాదవ్ అన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)