గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది
Breaking News
రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!
మునీర్ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్.. అమెరికాకు కొత్త టెన్షన్!
చెన్నైలో కలకలం.. ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్.. పోలీసుల కుట్రలు
పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
బంగ్లాదేశ్–మయన్మార్ తీరం దిశగా ‘మోకా’
Published on Fri, 05/12/2023 - 06:10
న్యూఢిల్లీ: మోకా తుపాను మరింత శక్తివంతంగా మారుతోందని, శుక్రవారం ఉదయానికల్లా మరింత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్–మయన్మార్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు గురువారం రాత్రి తెలియజేశారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 520 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ నుంచి దక్షిణ దిశగా 1,100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై మోకా తుపాను ఆవరించి ఉంది. ఆదివారం ఉదయం వరకూ ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.
#
Tags : 1