Breaking News

రామ్‌లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!

Published on Sat, 03/02/2024 - 14:24

అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్  దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్‌ సింగ్‌ బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు.

అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. 

తాజాగా రామ్‌లల్లాను దర్శించుకున్న ఆయన  తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్‌ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)