Breaking News

దొంగనుకుని దళితుడ్ని చావబాదారు

Published on Tue, 10/07/2025 - 06:25

రాయ్‌బరేలీ: రాత్రి వేళ చోరీలు జరక్కుండా గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు..తామడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో, దొంగగా అనుమానించి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. తీవ్రమైన గాయాలు, రక్తస్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉంఛాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత బుధవారం చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగు చూ సింది. 

డ్రోన్లతో సర్వే చేసి మరీ రాత్రి వేళల్లో  దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి సంచరిస్తోందంటూ కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పుకార్లు వస్తున్నాయి. దీంతో, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి ఏరి యాలో వారే గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. బుధ వారం రాత్రి జమునాపూర్‌ క్రాసింగ్‌ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు నిలదీశారు. తమ ప్రశ్నలకు అతడిచ్చిన సమాధా నాలతో సంతృప్తి చెందని గ్రామస్తుల గుంపు అతడిపై దాడికి పాల్పడింది. 

విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఈశ్వర్‌దాస్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ వరకు లాక్కెళ్లి వదిలేశారు. గురువారం ఉదయం పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫతేహ్‌పూర్‌కు చెందిన హరిఓం(40)అనే దళితుడిగా అతడిని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఘటనపై సమాచారం అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశామని అదనపు ఎస్‌పీ సంజీవ్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు. దారుణంలో పాలుపంచుకున్న మరికొందరిని సైతం గుర్తించి, అరెస్ట్‌ చేసే పనిలో ఉన్నామన్నారు. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)