Breaking News

Misal Pav: ప్రపంచ గుర్తింపు.. భారత్‌లో అత్యంత రుచికరమైన వేగన్‌ ఫుడ్‌ ఇదే!

Published on Mon, 04/24/2023 - 20:57

స్నాక్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా  తింటారు. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయరు. సాయంత్రమైతే చాలు నోరు లాగేస్తుంది.. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్నాక్స్‌లో బ్రెడ్‌తో చేసే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వడాపావ్‌, పావ్‌ బాజీ, మిసాల్‌ పావ్‌. ఇవన్నీ మహారాష్ట్రలో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్స్‌.

మిసల్ పావ్..
మహారాష్ట్రలోని పావ్ ఆధారిత స్ట్రీట్ ఫుడ్స్‌కు చెందిన ప్రముఖ వంటకం మిసల్‌ పావ్‌. ఇది రోడ్‌సైడ్ స్టాల్స్, బ్రేక్‌ఫాస్ట్ జాయింట్‌లు, ఆఫీస్ క్యాంటీన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. మాత్ బీన్స్ మొలకలు(అలసంద గింజలు), కొబ్బరి, టమాటా, మసాలా దినుసులతో స్పైసీ కూరలాగా తయారు చేస్తారు. తరువాత దీనిపై సేవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి బ్రెడ్‌తో వడ్డిస్తారు. అయితే మిసల్‌ పావ్‌లో ఉపయోగించే పదార్థాలు, ప్రదేశాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. పుణె మిసల్‌, ఖండేషి మిసల్‌, నాసిక్‌ మిసల్‌, అహ్మద్‌నగర్‌ మిసల్‌ ప్రఖ్యాతిగాంచాయి. 

2015లో లండన్‌లోని ఫుడీ హబ్ అవార్డ్స్‌లో మిసల్‌ పావ్‌ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరు పొందింది. ఈ అవార్డును ఆస్వాద్ రెస్టారెంట్‌ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్‌ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్‌ను అందజేస్తుందని నివేదిక వెల్లడించింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ వంటకం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మిసల్‌ పావ్‌ మళ్లీ మొదటి స్థానం సంపాదించింది.

ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని బెస్ట్‌-రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసాల్ పావ్ 11వ స్థానానికి చేరుకుంది. వీటితోపాటు మరో మూడు వంటకాలు ఆలూ గోబీ, రాజ్మా, గోబీ మంచూరియన్‌ కూడా  టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలిచింది, రాజ్మా 22వ స్థానంలో నిలిచింది మరియు గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది. ఇవేగాక మసాలా వడ 27వ స్థానంలో, భేల్‌పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిలిచారు. మొత్తం టాప్‌ 50లో  భారత్‌ నుంచి ఏడు వెజిటేరియన్‌ వంటకాలు ఎంపికయ్యాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)