Breaking News

Uttarakhand: క్లౌడ్ బరస్ట్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌

Published on Tue, 08/05/2025 - 20:14

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ముంచేసిన వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

"భాగ్ భాయ్ భాగ్, అరే భాగ్ భాగ్! (పరిగెత్తు.. పరిగెత్తు) అంటూ దూరం నుంచి అరుస్తున్నవారి మాటలు వీడియోలో వినిపిస్తాయి.. ఒక వ్యక్తి బురద నీటిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు.

ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్‌’లో తెలిపింది. మరో వైపు స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. బురదను తొలగించి.. బాధితులను బయటకు తీసుకురాడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వర్షాలు కారణంగానే ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

 

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)