Breaking News

రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఆయుధాల అప్‌గ్రేడ్

Published on Sun, 12/21/2025 - 21:29

భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆధునాతన ఆయుధాల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీలో  రూ.79 వేల కోట్ల విలువగల ఆయుధాల కొనుగోలుకు అనుమతులిచ్చారు.

ఈ నిధులతో ఇండియన్ ఆర్మీకి సంబంధించి నాగ్ మిసైల్ సిస్టమ్ . నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫార్మ్ డాక్స్ నిర్మాణం, నావల్ సర్పేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడో తదితర యుద్ధ సామాగ్రి కొనుగోలుచేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణి వ్యవస్థను ఆర్మీ వాహనాలపై మోహరిస్తారు.ఈ క్షిపణులుశత్రు ట్యాంకులు, బంకర్లు మరియు ఇతర బలవర్థకమైన గోడలను నాశనం చేయగలవు. 

నేవీకి సంబంధించి  ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నిర్మించనున్నారు. సముద్రం నుండి భూమి మీద చేసే దాడులను ఇవి సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఇవి శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, ఇతర సహాయం  విపత్తు నిర్వహణకు  ఉపయోగపడతాయి. వీటితో పాటు  నావల్ సర్ఫేస్ గన్ మరియు అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలను కొనుగోలు చేయనున్నారు. ఇవి ఇది అణు మరియు తేలికపాటి  జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలవు.

ఎయిర్‌ఫోర్స్‌ని ఆధునీకరించడానికి కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనున్నారు.  ఈ వ్యవస్థ విమానం టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, లక్ష్యాలను గుర్తించడంతో పాటు  మరియు పైలట్ లేకుండా దాడి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఆయుధాల ఆదునీకరణ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా రక్షణ, సహాయక చర్యలు, శాంతి మిషన్లు, విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.

అంతేకాకుండా వీటిలో చాలా మట్టుకు భారత్‌లోనే తయారవుతున్నాయని దీనివల్ల  మేకిన్ ఇండియాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)