రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు: మంత్రి ఉత్తమ్‌

Published on Thu, 12/14/2023 - 09:52

సాక్షి, న్యూఢిల్లీ: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, వాస్తవాలను దాచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి విమర్శించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.67 వేల కోట్లుగా ఉన్న అప్పులను తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా రూ.4.50 లక్షల కోట్లకు పెంచేశారని ధ్వజమెత్తారు.

బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ కొను గోళ్లకు సంబంధించి రూ.81 వేల కోట్లు, పౌర సర ఫరాల శాఖకు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్‌కు సంబంధించి రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉత్తమ్‌ తెలిపారు.

ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై విచారణ జరుగుతుందని, విచారణను జాతీయ సంస్థలతో చేయించాలా లేక రాష్ట్ర సంస్థలతోనా? అన్నది ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. మేడిగడ్డ డిజైన్, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులన్నది తేలుస్తామన్నారు.

సోనియా, రాహుల్‌తో భేటీ
హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఉత్తమ్‌ బుధవారం తన ఎంపీ పదవికి రాజీ నామా చేశారు. స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి రాజీ నామా పత్రం అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)