ఏయ్‌.. నా బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!

Published on Sun, 02/23/2025 - 17:16

లక్నో : ఏయ్‌.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు.  ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో మంత్రి సోమేంద్ర తోమర్‌ మేనల్లుడు  ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.

ఆ సమయంలో అక్కడే  పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో  ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.

స్కార్పియోలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.

ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున‍్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)