Breaking News

ప్రకాశ్‌రాజ్‌.. ఆంధ్ర రైతుల సంగతి చూడు

Published on Wed, 07/09/2025 - 12:16

కర్ణాటక: ప్రముఖ నటుడు, సామాజిక అంశాలపై గళమెత్తే ప్రకాశ్‌రాజ్, కాంగ్రెస్‌ సర్కారు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లిలో పరిశ్రమలకు భూములు సేకరించడాన్ని ఖండిస్తూ రైతుల ధర్నాలో ఆయన పాల్గొనడాన్ని ఓ మంత్రి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు ఇస్తున్నారని,  భూ స్వాదీనం తప్పనిసరి అని పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో భూముల స్వాధీనం జరుగుతోందని, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.

ప్రకాశ్‌రాజ్‌ కర్ణాటకలో కంటే ఆంధ్ర, తమిళనాడులో బాగా ఫేమస్‌ అన్నారు. రాష్ట్రంలో హైటెక్‌ డిఫెన్స్, ఏరోస్పేస్‌ పార్క్‌ కోసం 1200 ఎకరాల భూమి మాత్రమే స్వాదీనం చేసుకుంటుంటే, ఇదే అవసరానికి ఆంధ్రప్రదేశ్‌లో మడకశిర నుంచి పెనుకొండ వరకూ 10 వేల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ  అవసరాల పేరుతో అన్నదాతల నుంచి 45 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని, విశాఖ పట్నంలో 95 పైసలకు ఒక ఎకరాను కట్టబెడుతున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రకాశ్‌ రాజ్‌ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి సవాల్‌కు ప్రకాశ్‌రాజ్‌ ఏమని స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది.

 

#

Tags : 1

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)