Breaking News

రెండు నెలల్లో ప్రారంభం.. రెండేళ్లలో పూర్తి!

Published on Thu, 06/27/2024 - 03:39

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిర్మించబోయే తెలంగాణ భవన్‌ దేశానికి ఐకానిక్‌గా ఉంటుంద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించి రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. హంగూ, ఆర్భా టాలనేవి భవన్‌ నిర్మాణంలో కనిపించవని.. అయితే ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆగి మరీ భవ న్‌ను చూసేలా మోడ్రన్‌గా నిర్మిస్తామని వివ రించారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిజైన్‌ను ఖరా రు చేసిన వెంటనే పనులు ప్రారంభమవు తాయ ని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ జితేందర్‌ రెడ్డి బాధ్య తల స్వీకారం కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అదిరిపోయేలా నిర్మాణం
పదేళ్లుగా తెలంగాణకు ఢిల్లీలో భవన్‌ లేకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి పేర్కొ న్నారు.  సుమారు రూ.400–500 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ భవన్‌ అదిరిపోయేలా నిర్మిస్తామని చెప్పారు. రెండు కంపెనీలు బిల్డింగ్‌ నిర్మాణం గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చాయన్నారు. 

వాళ్లు గోపురం టైపులో నిర్మిద్దామనే డిజైన్‌ ఇవ్వడంతో..తాను కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. సింపుల్‌ లుక్‌లో భవన్‌ అదిరిపోయేలా ఉండాల ని సూచించినట్లు తెలిపారు. అందుకు తగ్గ డిజై న్లు వచ్చిన వెంటనే 2 నెలల్లోపే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. హైదరా బాద్‌ హౌజ్‌ పక్కన గవర్నర్, సీఎం బంగ్లాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 

జగన్   వల్లే పరిష్కారమైంది
రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించిన 19 ఎకరాల ఆస్తుల్లో 42% వాటా తెలంగాణకు రావాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ఆస్తులను సాధించుకోవడంలో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పటౌడీ హౌజ్, హైదరాబాద్‌ హౌజ్‌ల పక్కన స్థలాలు తెలంగాణకు కేటాయించాలంటూ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ను తాను కోరడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లు చెప్పారు. 

ఆ వెంటనే అప్పటి సీఎస్‌ జవహర్‌ రెడ్డితో కూడా మాట్లాడి ఏపీ, తెలంగాణకు కేటాయించాల్సిన ఆస్తులపై చర్చించి కేంద్రానికి తెలిపామన్నారు. కేంద్రం కూడా స్థలాల్ని రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడి సాధించుకుంటామన్నారు. 

హైదరాబాద్‌ – విజయవాడ బుల్లెట్‌ ట్రైన్, కృష్ణా– గోదావరి ట్రిబ్యునల్‌ వ్యవహారం వంటి సమస్యలకు కేంద్రం నుంచి పరిష్కారాన్ని సాధిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)