Breaking News

వీడియో: కేంద్రమంత్రి సింధియాకు తప్పిన ప్రమాదం.. పోలీసులకు గాయాలు!

Published on Sat, 11/30/2024 - 20:33

భోపాల్‌: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్‌బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్క‌సారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.

ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా త‌ల‌పైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగ‌లు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి త‌ర‌లించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)