Breaking News

అమెరికా ఎన్నికల వేళ ట్రంప్‌పై జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 02/25/2024 - 11:17

న్యూఢిల్లీ: డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్‌- అమెరికా సంబంధాలపై భారత  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న 2017-2021 మధ్య కాలంలో అమెరికాతో భారత్‌ మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంత బలోపేతమయ్యాయన్నారు. ఢిల్లీలో జరిగిన కాన్‌ఫ్లిక్ట్‌, కంటెస్ట్‌, కో ఆపరేట్‌, క్రియేట్‌ సదస్సలో జై శంకర్‌ ప్రసంగించారు.

2020లో ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చారని, మోదీ కూడా పలుమార్లు అమెరికా వెళ్లారని జై శంకర్‌ గుర్తు చేశారు. ఒక్క ట్రంపే కాదని, బిల్‌ క్లింటన్‌ తర్వాత వచ్చిన ప్రతి అమెరికా అధ్యకక్షుని హయాంలో ఆ దేశంతో అమెరికా సంబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, ఇప్పటికే జరుగుతున్న రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే ప్రైమరీల్లో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సౌత్‌ కరోలినాలో తన ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ట్రంప్‌ ఈసారి మళ్లీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఇప్పటికే వెల్లడిస్తున్న కొన్ని పోల్స్ ఫలితాల్లో ఈసారి బైడెన్‌ కంటే ట్రంప్‌నకే ఎక్కువ అవకాశాలున్నయని వెల్లడవడం విశేషం. 

ఇదీ చదవండి.. ఢిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)